కాంగ్రెస్‌లో ప్రియాంక వర్సెస్ రాహుల్.. బీజేపీ సంచలన ఆరోపణలు
Advertisement
- రైహాన్ ఎగ్జిబిషన్ వివాదంపై రాహుల్ మౌనాన్ని ప్రశ్నించిన భండారీ
- ఈ వివాదంతో తన కుమారుణ్ని తెరపైకి తెచ్చేందుకు ప్రియాంక ప్రయత్నిస్తున్నారన్న భండారీ
- రాహుల్‌పై ప్రియాంకకు రాజకీయ విశ్వాసం తగ్గిందా? అని ప్రశ్న
- రైహాన్ వివాదంపై ఇప్పటి వరకు బహిరంగంగా స్పందించని రాహుల్
Advertisement
కాంగ్రెస్‌లో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మధ్య అంతర్గత పోరు సాగుతోందని బీజేపీ ఆరోపించింది. ప్రియాంక కుమారుడు రైహాన్ వాద్రా ఫొటో ఎగ్జిబిషన్లో కొన్ని చిత్రాలను తొలగించిన వివాదంపై రాహుల్ గాంధీ స్పందించకపోవడాన్ని ఆ పార్టీ ప్రస్తావించింది. ఈ వివాదాన్ని సృష్టించి తన కుమారుడిని రాజకీయంగా తెరపైకి తీసుకొచ్చేందుకు ప్రియాంక ప్రయత్నిస్తున్నారని బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ విమర్శించారు. రాహుల్‌పై ప్రియాంకకు రాజకీయ విశ్వాసం తగ్గిందా? అని ప్రశ్నించారు.
వ్యక్తిగత పర్యటన కోసం గత ఆదివారం వియత్నాం వెళ్లిన రాహుల్ గాంధీ.. రైహాన్ ఎగ్జిబిషన్ వివాదంపై ఇప్పటివరకు బహిరంగంగా స్పందించలేదు. ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్‌లో ప్రియాంక వర్సెస్ రాహుల్ పరిస్థితి నెలకొందని భండారీ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు. అయితే, కొన్ని రోజుల క్రితమే ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో రాహుల్, ప్రియాంక కలిసి పాల్గొన్న విషయం తెలిసిందే.
ఢిల్లీలో ఇటీవల జరిగిన విద్యార్థుల నిరసనలకు సంబంధించిన ఫొటోలను తన ఎగ్జిబిషన్ నుంచి తొలగించారని కళాకారుడు, ఫొటోగ్రాఫర్ రైహాన్ వాద్రా బుధవారం వెల్లడించారు. ‘నో ఐడియా ఈజ్ ఫైనల్’ పేరుతో బికనీర్ హౌస్‌లో ఈ ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఎగ్జిబిషన్ ప్రారంభానికి కొన్ని గంటల ముందు 105 ఫొటోల్లో 74 చిత్రాలను తొలగించాలని లేదా వాటి స్థానంలో వేరేవి పెట్టాలని నిర్వాహకులు కోరినట్లు రైహాన్ తెలిపారు. ప్రదర్శన ప్రారంభమయ్యే సమయానికి 35 ఫ్రేములు మాత్రమే మిగిలాయని చెప్పారు. ఈ చిత్రాల సేకరణ కోసం మూడేళ్లు కష్టపడ్డానని పేర్కొన్నారు.
అక్టోబరు 15నే ఎగ్జిబిషన్ లేఅవుట్‌ను బికనీర్ హౌస్ యాజమాన్యానికి పంపించానని, దానికి సంబంధించిన అంగీకార సమాచారం కూడా అందిందని రైహాన్ వెల్లడించారు. చిత్రాల ఏర్పాట్లు ప్రారంభించిన తర్వాతే అభ్యంతరాలు వ్యక్తమయ్యాయని ఆయన తండ్రి రాబర్ట్ వాద్రా తెలిపారు. మరోవైపు, తమ ప్రాంగణ విధానాలకు అనుగుణంగా లేవని గుర్తించిన ఫొటోలను తొలగించాలని కోరినట్లు బికనీర్ హౌస్ ప్రకటించింది.
ఈ వివాదంపై స్పందించిన ప్రియాంక గాంధీ.. యువత గొంతును అణచివేసే ప్రయత్నంగా అభివర్ణించారు. రైహాన్ పంపిన ఇమెయిల్, ఎగ్జిబిషన్ ప్రతిపాదనకు సంబంధించిన స్క్రీన్షాట్లను బీజేపీ పంచుకుంది. జూన్ 10న పంపిన ప్రతిపాదనలో ప్రకృతి, వన్యప్రాణులు, అబ్స్ట్రాక్ట్ ఆర్ట్, పోర్ట్రెయిట్లు, శిల్పాల వంటి అంశాలే ఉన్నాయని భండారీ పేర్కొన్నారు. అందులో రాజకీయ అంశాల ప్రస్తావన లేదని అన్నారు. జూన్ 30న బికనీర్ హౌస్ ఈ ప్రతిపాదనను అంగీకరించిందని బీజేపీ తెలిపింది.
అక్టోబరు 21న బికనీర్ హౌస్ యాజమాన్యం రైహాన్‌కు నోటీసు పంపి 74 ఫొటోలను తొలగించాలని కోరినట్లు భండారీ పేర్కొన్నారు. తొలుత రాజకీయ అంశాలు లేని ప్రదర్శనకు అంగీకారం పొందిన తర్వాత, కుటుంబం ఒత్తిడితో రాజకీయ ఫొటోలను చేర్చి ఉంటారని ఆరోపించారు. ఈ ఇమెయిళ్లు, ప్రతిపాదనలు ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ చేస్తున్న వాదనల్లోని అసత్యాలను బయటపెడుతున్నాయని బీజేపీ విమర్శించింది.